వరంగల్, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ గారి ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలోని జనసేన కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘానంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం బైరి వంశీ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి దేశ స్వాతంత్య్రం కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడిన వీరుడతడు. నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్‌తో పాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో ఉరి తీశారు. ఈ ముగ్గుర్ని ఉరి కొయ్యల ముందు వరుసగా నిలబెట్టగా వీరు ఏ మాత్రం అధైర్యపడకపోగా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ప్రాణత్యాగం చేసిన రోజును షహీదీ దివాస్‌గా జరుపుకొంటూ ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి జన్ను ప్రవీణ్, కార్యదర్శులు శేషాద్రి సందీప్, కన్నెబోయిన రాజు యాదవ్, ఉమ్మడి వరంగల్ యువజన విభాగం కార్యదర్శి ల్యాదేల్లా రాకేష్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నిఖిల్ చోప్రా, డిజిటల్ మీడియా మెంబెర్ మెడివెల్లి సంతోష్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.