Logo
Date of Publish : 15 March 2022, 4:52 pm
Editor : Sake Naresh

యస్ కే యూనివర్సిటీలో భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జనసేనపార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    యస్ కే యూ, (జనస్వరం) : జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యస్ కే యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని విద్యార్థులను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచాక నిరుద్యోగులను ముంచుతున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తున్నాయి. జనసేన పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకొని 9 వసంతంలోకి దిగ్విజయంగా పూర్తి చెయ్యాలని కోరుతున్నాము. జనసేన పార్టీ 2024లో అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన రాజకీయాలు, సిద్దాంతాలు మార్పుకు నాంది పలుకుతున్నాయి. దేశంలో మొట్టమొదటి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజలందరూ జనసేనతో మార్పు కోరుకుంటున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు సునీల్, వంశీ, బాషా, సంతోష్, రాజు, మహేష్, పవన్, ఆంజనేయులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com