
ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృడ సంకల్పంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు జనసేనపార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రజల ఆశీర్వాదంతో పవనన్న ప్రజాబాట 17వ రోజు,ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెం ఎస్సీ కాలనీలో పర్యటించి, అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేనపార్టీ తరఫున తమవంతు కృషి చేస్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు సురేంద్ర, చంద్ర, వంశీ, భరత్, రవి, వేణు, భాను కిరణ్, అనిల్, నాగరాజు, హజరత్, మోక్షత తదితరులు పాల్గొన్నారు.