Logo
Date of Publish : 12 May 2023, 8:35 am
Editor : Sake Naresh

బెట్టింగ్ అనిల్ కుమార్ యాదవ్ రౌడీ పనులు మానుకోవాలి

              నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిపై వైసీపీ రౌడీ మూకల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ జనసేన పార్టీ కార్యాలయంలో నేడు జిల్లా చిరంజీవి యువత సీనియర్ నాయకులు ఏటూరి రవి, కారంపూడి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు మార్కెట్ సురేష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు హరిరెడ్డి, జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, సర్వేపల్లి నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు సిటీలో కనీస అభివృద్ధిని కూడా చేయలేక నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన వైఫల్యాలను, చేతగానితాన్ని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు రౌడీ మూకలను ఉసిగొల్పడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే అనిల్ కు నిబద్ధత ఉంటే తాము ప్రశ్నించే అంశాల పనుల ప్రారంభానికి పూనుకోవాలి కానీ ఇలా పిరికిపందలా పిచ్చి పనులు చేయకూడదని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు తాము ఆవేశాన్ని అణచుకుంటూ శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్నామని, కానీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారిపై నిన్న వైసీపీ రౌడీ మూకల దాడి జరిగిన వెంటనే తమ ప్రతిస్పందన ఎలా ఉందో జిల్లా మొత్తం ప్రజలు చూశారని, ఇది శాంపిల్ మాత్రమే అని, మరోసారి ఇటువంటి పిచ్చి పిరికిపంద చర్యలకు పాల్పడితే ఇంతకు వంద రెట్ల ప్రతిస్పందన చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. బెట్టింగ్ వంటి అంశాల్లో ఆరితేరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి అంత ప్రిస్టేజీ ఉంటే నగర అభివృద్ధి మీద ఆ ప్రిస్టేజీని చూపాలి కానీ, ఇలాంటి పనికిమాలిన పనుల మీద కాదని అన్నారు. ఎంతో ప్రశాంతమైన రాజకీయాలకు పేరు గాంచిన నెల్లూరు జిల్లాలో రౌడీ మూకలతో అల్లర్లు చేయిస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యవహారం చూస్తుంటే ఎంత అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారో తెలుస్తోందని, మరొక్కసారి మా నాయకులపై దాడులు చేయాలనే ఆలోచన వచ్చినా సరే తీవ్ర పరిణామాలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com