కావలి ( జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద సిద్దు చేస్తున్న సేవా కార్యక్రమాలు పవనన్న క్యాంటిన్ ద్వారా 480రోజుల నుండి కావలి పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ప్రతిరోజు వందలమంది పేదల ఆకలి తీరుస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా రికార్డ్ స్థాయిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తునందుకు గాను కావలి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కావలి RDO గారి చేతుల మీదగా ఉత్తమ సేవా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సిద్దు, తోట శేషయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఆలూరు చంటి, సాయి, విష్ణు, ఈశ్వర్, శశి, కృష్ణ, సాయి, వంశీ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com