కంభం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, కంభం మండలం పెద్ద నల్లకల్వ గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లం కొండ సాయిబాబు నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికి వెళ్లి గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. బెల్లంకొండ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనసేన పార్టీ కౌలు రైతులు 3000 మందిని గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క ప్రకాశం జిల్లాలో 77 మంది కౌలు రైతులకు 77 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందని గ్రామస్థులకు తెలియపరిచారు. జనసేన పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com