Logo
Date of Publish : 02 October 2026, 11:03 am
Editor : Sake Naresh

బీసీవై పార్టీ సమన్వయ కమిటీ పర్యటన : జయకళ్యాణి ఆకుల

అమరావతి, అక్టోబర్ 2, జనస్వరం : భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ఆదేశాలు మేరకు ఈ నెల 2వ తేది నుంచి 5వ తేది వరకు బీసీవై రాష్ట్ర సమన్వయ కమిటీ కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో బీసీవై పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. శుక్రవారం 10.30 గంటల నుంచి, కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్ బృందావనం ధియేటర్ దగ్గర ఉన్న ఎస్.జీ హ్యాపీ స్టే వద్ద, శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ రోడ్డు ఎన్ఆర్ పేట లేడీస్ క్లబ్ వద్ద, ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జవహర్ స్ట్రీట్ వెంకీ రెసిడెన్సీ వద్ద, సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం పెద గంట్వాడ దయాళ్ నగర్ ఆదిరెడ్డి ఫంక్షన్ హాలులో బీసీవై రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించనున్నారు. భారత చైతన్య యువజన పార్టీ పట్ల ఆకర్షితులై బోడే రామచంద్రయాదవ్ నాయకత్వంలో పని చేసే అభ్యర్ధుల దరఖాస్తులు స్వీకరించి పార్టీలో చేర్చుకునే ఏర్పాట్లను చేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు శ్రీమతి జయ కళ్యాణి ఆకుల తెలిపారు. మరిన్ని వివరాల కు పార్టీ ఆఫీసియల్ నెంబర్ 8886312345 కు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కి సంబంధించన పార్టీ బలోపేతం కొరకు 99488 93355 కు సంప్రదించండి.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com