అనంతపురం ( జనస్వరం ) : కణేకల్ మండలం బెనికల్ గ్రామంలో గౌరీమాత పండుగ సందర్భంగా మహిళల హారతులు ఇవ్వడానికి వెళ్తే గ్రామంలో ఇతర వర్గాలుగా మాట్లాడుతూ మీరు గుడిలోనికి రాకూడదు గుడి దగ్గర కూడా రాకూడదని మాట్లాడారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బి.సి.ఆర్ దాస్ ఆ గ్రామాన్ని సందర్శించి, దళితులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పండుగ సందర్భంగా ఎద్దుల పోటీల్లో పాల్గొనడానికి దళితులు ముందుకు రావడంతో దళితులు రాకూడదని దండోర వేశారు. అరిష్టమని అవమానపరిచారు. తర్వాత రోజు కరెంటు తీసి రాళ్లు విసినారు. అప్పుడు అక్కడున్న CI యుగేందర్ డిఎస్పీ ఆదేశాలు అమలురచడమే కాకుండా స్వయానా సిఐ వారి సిబ్బంది ఎస్ఐ వాళ్ళు మరియు వారి సిబ్బంది అల్లర్లు జరగకుండా ముందుండి ఇతర వర్గాలను చెదరగొట్టారని చెప్పారు. ఎస్సీలను కాపాడి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరియు గాయాలు కాకుండా చూసిన CI యుగేందర్ ను, వారి సిబ్బందిని కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. పోలీసులు లేకుంటే మేము పీసులు పీసులు అయ్యే వాళ్ళమని మహిళలు బి.సి.ఆర్ దాస్ ఎదురుగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి పిల్లల చదువులు పట్ల జాగ్రత్త తీసుకొని తప్పకుండా వారిని చదివించాలని కోరారు. అదేవిధంగా మీకు లక్షల మంది ఉన్న దళితులు అండగా ఉండాలని మీరు భయపడే పని అవసరం లేదని ధైర్యం చెప్పారు. గ్రామంలోని యువకులు సుమారు 30 మంది కనేకల్ పోలీస్ స్టేషన్ వచ్చి జరిగిన సంఘటనలపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు వారి కేసు నమోదు చేసి కారుకులైన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. మూడు నెలలు గ్రామంలో పోలీస్ వికెట్ ఉండాలని కోరారు. గ్రామంలో 45 ఇండ్లు ఉన్నందున మూడు నెలలు ప్రతి ఇంటికి బత్యం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ని కలిసి గ్రామంలో దళితులు పరిస్థితిని వివరించి చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.