• జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 11 (జనస్వరం) : బీసీలే సమాజానికి వెన్నుముకని అలాంటి వారిని ముందుండి నడిపించి వారిలో చైతన్యం తీసుకొచ్చిన మహానేత జ్యోతిరావు పూలే అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయం వద్ద గురువారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి బీసీల అభ్యున్నతి కోసం పోరాడి, వారిలో చైతన్యం తీసుకురావడానికి తన భార్య సావిత్రిబాయి పూలేనే ఉపాధ్యాయురాలిగా ప్రోత్సహించి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అలాంటి సమాజంలో బీసీలను 67 ముక్కలుగా చేసి వారికి కనీసం నిధులు వెచ్చించకుండా వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలను ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకురావడమే తమ కూటమి ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, జనసేన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.