రాజానగరం ( జనస్వరం ) : సీతానగరం మండలంలో బాధిత కుటుంబాలను పలకరించి కొంత ఆర్థిక సహాయం అందించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి. పురుషోత్తపట్నం గ్రామానికి కండెల్లి సతీష్ (చిరంజీవి)కి మిషన్ ప్రమాదంలో కాలికి గాయం అయింది. వారిని పలకరించి వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సింగవరం, దుర్గమ్మ కాలనీకి చెందిన సత్తి మంగతాయారు గారికి డెంగ్యూతో బాధపడుతుండగా... వారి పేదరికం దృష్ట్యా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, ప్రశాంత్ చౌదరి, కాండ్రేకుల పోసి రత్నాజి, మద్దాల యేసుపాదం, మట్ట సుబ్రహ్మణ్యం, చీకట్ల వీర్రాజు, కొండాటి సత్యనారాయణ, సత్యప్రసాద్, పిండి వివేక్, కొట్టి రవీంద్ర, చిక్కం నాగేంద్ర, బ్రహ్మం, కిల్లాడి వీరయ్య, బి ప్రసాద్ గారు ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com