Logo
Date of Publish : 19 September 2023, 10:14 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ చందానగర్ డివిజన్-110 అధ్యక్షులుగా బసవపత్రి అరుణ్ కుమార్

       హైదరాబాదు ( జనస్వరం ) : జనసేన పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షులుగా బసవపత్రి అరుణ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించటం జరిగింది. గతంలో అరుణ్ కుమార్, చందానగర్ కేంద్రంగా అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ ( ABVP) లో 2010 నుండి 2014 వరకు విద్యార్థి నాయకుడిగా పని చేసారు. చందానగర్ లోని విద్యార్థి సమాజం కు నాయకత్వం వహిస్తూ అనేక సమస్యలకు పరిష్కారం చూపటం జరిగింది. ఆ తర్వాత జనసేన పార్టీలో సైనికుడిగా పార్టీ కోసం పనిచేస్తూ పలు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. ఈ సంధర్భంగా శ్రీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ఉ ,పాధ్యక్షులు మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో చందానగర్ డివిజన్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం అంకితభావంతో పనిచేస్తానని, చందానగర్ డివిజన్ లోని ప్రతి ఓటర్ వద్దకు, యువతకు జనసేన పార్టీని చేరుస్తానని అన్నారు. చందానగర్ లో జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను నిర్మాణం చేస్తానని, ప్రజలతో మమేకమై, సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తూ, ప్రభుత్వం మరియు యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించి, ప్రజలకు జనసేన పార్టీపై నమ్మకం కలిగేలా కృషి చేస్తానని తెలిపారు. చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా అరుణ్ కుమార్ నియామకం పట్ల డివిజన్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com