
మదనపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ సభకు వచ్చిన స్పందన చూసి వైసిపి వారికి వణుకు మొదలైందని, మాకు గేటు పాసులు ఇవ్వడం కాదు సిఎం సహా అందరిని ఇంట్లో కుర్చోబెట్టడానికి ప్రజలే మీకు గెటుపాస్ రెడి చేశారని జనసేన పార్టీ దక్షిణ రాయల కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త డాక్టర్ మైఫోర్స్ మహేష్ తీవ్ర స్దాయిలో మండిపడ్డారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ గుడ్డివాడు, క్యారెక్టర్ లెస్, క్యాబరే డ్యాన్స్ వేసుకునే అమరనాథ్, జబర్దస్త్ రోజా, ఆంబోతూ అంబటి, పేర్ని నాని లాంటి కుక్కలు నోరు పారేసు కోవడం మానుకోవాలని హెచ్చరించారు. జనసేన పార్టీ నిర్వహించిన మచిలీపట్నం సభకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడం శుభపరినామం అన్నారు. సిఎం సభలకు జనాన్ని తోలుకు వచ్చి వారిని కుర్చోబెట్టడానికి వైసిపి నాయకులు నానా తంటలు పడితే జనసేన పార్టీ సభకు వచ్చిన జనం ఎంతో క్రమ శిక్షణగా వున్నారని అన్నారు. సాక్షిలో రాసిన రాతలపై మండిపడ్డారు. అంబులెన్స్ లకు దారి ఇవ్వలేదని, జనం లేరనే తప్పుడు కధలను తప్ప పట్టారు. విజయవాడ ఆటో నగర్ నుండి మచిలీపట్నం వరకు జన నీరాజనాన్ని చూసి ఉలికిపాటుకు గురై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పొత్తుల విషయాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు చూసుకుంటారని అంతవరకూ టిడిపి వారు అనవసర, అసత్య ప్రచారాలు మానుకుని పొత్తులకు సహకారించాలని సూచించారు. 20, 30 సీట్లు అంటూ అనవసర ప్రచారం వద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ సూచనలతో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మల్లిక, శోభ తదితరులు పాల్గొన్నారు..