Logo
Date of Publish : 16 November 2020, 5:35 pm
Editor : Sake Naresh

విజయనగరం కామాక్షి నగర్ లో బార్ & రెస్టారెంట్ తక్షణమే తొలగించాలి : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణ

విజయనగరం కామాక్షి నగర్ లో బార్&రెస్టారెంట్ తక్షణమే తొలగించాలి : జనసేన నాయకులు త్యాడ రామకృష్ణ

                    విజయనగరం కామాక్షినగర్ లో తక్షణమే సుప్రియ రెస్టారెంట్&బార్ ను ఎత్తివేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన ఝాన్సీ వీరమహిళ తుమ్మిలక్ష్మీరాజ్ సోమవారం కలక్టరేట్ గ్రీవిన్స్ అధికారి, జిల్లా విపత్తుల అధికారి శ్రీమతి పద్మావతి గారికి, మధ్యనిషేధం & ఆబ్కారీ ఉపకమీషనర్ జిల్లా కార్యాలయం సూపరెండేంట్ శ్రీ సుధీర్ గారికి మరియు జిల్లా సూపరెండేంట్ ఆఫ్ పోలీసు గ్రీవిన్స్ లో అడిషనల్ సూపరెండేంట్ పోలీసు వారికి సుమారు వందమంది స్థానిక ప్రజల సంతకాలతో కూడియున్న వినతిపత్రాల్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆయన వైఖరి పూర్తిగా భిన్నంగా ఉందని, మొదట్లో మద్యం ధరలు పెంచుతూ మద్యం షాపులను కుదిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఈరోజు సవరణల పేరుతో యథాస్థానానికి తెచ్చారని ఆరోపించారు. సవరణల పేరుతో తీసుకున్న నిర్ణయంతో విజయనగరం, కామాక్షి నగర్ 42 వ డివిజన్ లో సుప్రియ రెస్టారెంట్ & బార్ వెలసింది. ఈ బార్ & రెస్టారెంట్ కామాక్షి నగర్ నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నందున అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చిన్న చిట్కా పనులపై బయటకు వచ్చే మహిళలపై అక్కడ తాగుబోతులు ఆకృత్యాలు మొదలయ్యాయి. ఆ ప్రాంతంలో నిత్యం జనాలు తిరుగుతూనే ఉంటారు. వారందరికీ కూడా ఈ సుప్రియ బార్ అండ్ రెస్టారెంట్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనికితోడు మద్యం తాగేవారు అక్కడే ఆ సీసాలను పగలగొడుతూ వచ్చి పోయే వారికి ఆటంకం కలిగిస్తున్నారు. స్థానిక ప్రజలు ఉద్యోగస్తులు, వృద్ధులు, విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో.. ఈ దీపావళి సమయంలో ఇళ్లలోకి సీసాలు విసరడం అవి జరగడంతో, తాగుబోతులు మద్యంమ్మత్తులో ఇళ్ళల్లోకి చొరబడతారని భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి అక్కడ దగ్గరగా కమ్మరేకులతో కట్టిన ఓ స్వీట్ దుకాణం అగ్నిప్రమాదం కు గురి కావడంతో తాగుబోతుల పనే అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అందువల్ల సుప్రియ రెస్టారెంట్ అండ్ బార్ తక్షణమే అక్కడి నుంచి బార్ ను తొలగించకపోతే భవిష్యత్తు లో జనసేనతో పాటు కలిసివచ్చే రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని వారిమద్ధతుతో ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామని, ఆ సందర్భంలో జరిగేటువంటి ఎలాంటి లా & ఆర్డర్ ప్రాబ్లం కైనా ప్రభుత్వంమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మైనార్టీ నాయకులు హుస్సేన్ ఖాన్, లోపింటి కళ్యాణ్  పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com