2021 మునిసిపాలిటీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఉపసభాపతి కోన రఘుపతి గారు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు వారి విజ్ఞత లేమికి నిదర్శనం. జరిగిన పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో బాపట్లలో కూడా ఎన్నికల పోటీ జరిగితే మీ పార్టీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడుతుందేమోనన్న భయం మీచేత ఇలా మాట్లాడేలా చేసినదనిపిస్తుంది. పార్లమెంటు స్థానాలను జిల్లాలుగా ప్రకటించాలని ఇప్పటికే నిర్ణయించన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికలలో ఏకగ్రీవాల పేరుతో ప్రజలకు ఓటు ద్వారా నిబద్దత కలిగిన నాయకులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరించి కొత్తగా తెలియచేయాల్సింది ఏమీ లేదని జనసేన అభిప్రాయపడుతుంది. బాపట్ల జిల్లాకు బాపట్లను ప్రధాన కేంద్రంగా చేయడం ఎన్నికల సమయంలో బాపట్లను జిల్లా చేసితీరుతామని హామీ ఇచ్చిన మీ నైతిక బాధ్యత అని మరచిపోయి, ఏకగ్రీవం చేయకపోతే పట్టణానికి జరగవలసిన ప్రయోజనాలు కాపాడుకోలేమన్నట్లు బెదిరింపు ధోరణిలో మీరు మాట్లాడటం గర్హనీయం. ఇదే ధోరణిలో మాట్లాడుతూ మునిసిపాలిటీ వార్డులు ఏకగ్రీవం కాని పక్షంలో భవిష్యత్తులో మీరు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించినట్లయితే అదే ప్రజలు తదుపరి ఎన్నికలలో మీకు సమాధానం చేప్తారన్న వాస్తవాన్ని మరచిపోవద్దని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ హెచ్చరిస్తుంది. సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక నిర్మాణాత్మక మార్పే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కల్యాణ్ గారు అందించిన స్పూర్తితో బాపట్ల జనసైనికులు పట్టణంలోని అన్ని వార్డులలో పోటీ చేస్తారని బాపట్ల జనసేన పార్టీ స్పష్టం చేస్తుంది!
బాపట్ల జనసైనికులు సిద్దం కావాలి :
స్థానిక ఎన్నికలలో జనసేన ప్రభంజనం తేలికగ రాలేదన్నది అందరికీ అర్ధమైన వాస్తవం! దీని వెనుక మన జనసేన పార్టీ సిద్దాంతాలు బలంగా నమ్మి, జనసేనాని పవన్ కల్యాణ్ గారి ఆశయసాధనకు నిస్వార్ధంగా కృషిచేసిన జనసైనికులే కీలకం! ఈ స్పూర్తితో మరింత మంది ధైర్యంగ, నిస్వార్థంగ ముందడుగు వేస్తే మనం కలలుగన్న మార్పు త్వరలోనే సాధించవచ్చు! జనసేన విజయ పతాకను ఎగరవేసిన తోటి జనసైనికులు ఇచ్చిన స్పూర్తితో మన నియోజకవర్గంలో కూడా జనసైనికులు రాబోయే ఎన్నికలకు సిద్దం కావాలని, జనసేనను గెలిపించుకునే దిశగా కృషి చేయాలని కోరుతున్నాము అని అన్నారు.