Logo
Date of Publish : 23 November 2021, 3:50 pm
Editor : Sake Naresh

రోడ్డుకు మరమ్మతులు చేయాలని R&B అధికారులకు వినతి పత్రం ఇచ్చిన బనగానపల్లె జనసేన నాయకులు

    బనగానపల్లె, (జనస్వరం) : బనగానపల్లె మండలంలోని బనగానపల్లె నుండి గుత్తికి వెళ్లే మార్గంలో దద్దనాల ప్రాజెక్టు నుండి చిన్న రాజుపాలెం వరకు అలాగే యనకండ్ల గ్రామం నుండి బత్తులూరుపాడు గ్రామం వరకు రోడ్డు గుంతలమయమై అధ్వాన్నంగా తయారయింది అని జనసేన పార్టీ నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం R&B అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, బనగానపల్లె నుండి గుత్తి వెళ్లే మార్గంలో డబల్ రోడ్డు దద్దనాల ప్రాజెక్ట్ నుండి చిన్నరాజుపాలెం వరకు మాత్రం సింగల్ రోడ్డుగానే ఉందని, దాన్ని డబుల్ రోడ్డుగా మార్చాలని త్వరగా టెండర్లు పిలిచి రోడ్డుకు మరమ్మతులు చేపించాలని అధికారులకు జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసైనికులు అజిత్ రెడ్డి, జనార్ధన్, సుధీర్ రెడ్డి, చిన్న, చరణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com