Logo
Date of Publish : 23 May 2023, 3:02 pm
Editor : Sake Naresh

జయరాం రెడ్డి పైన అక్రమ కేసులను ఖండించిన బాల్యం రాజేష్

        అనంతపురం ( జనస్వరం ) : అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి మీద YCP నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి అక్రమ కేసులను నమోదు చేస్తున్నారని జనసేన నాయకులు బాల్యం రాజేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారంటే దమ్మున్న వైసిపి నాయకులు ఎవరైనా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను.  ఒక సామాన్య ఓటరుగా చెప్తున్నా మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిరూపణ చేసి మాట్లాడండి అసత్య ఆరోపణలు చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని ఉద్దేశంతోనే మీరు జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ పైన బురద చల్లాలని చూస్తున్నారు. అసత్య ప్రచారాలు మీరు ఎన్ని మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని అనుకోకండి. సామాన్య ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెబుతారు ఓటర్లు. జయరాం రెడ్డి గారు మురళీకృష్ణ గారిపై అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నామన్నారు. నీతి నిబద్ధత సమాజసేవ కలిగిన జయరాం రెడ్డి గారు కరోనా సమయంలో అనంత ప్రజలకు ఎంతగానో సేవ చేసిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు సమాజంలో జరిగే చెడుపై పోరాటం చేసి మీ విలువలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు. కులాలను అడ్డుపెట్టుకొని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య వైసిపి వాళ్లకు 200 రోజుల నుంచి ఇంటింటా జనసేన కార్యక్రమం ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల్లో జనసేన పార్టీ మరింత బలంగా ఎక్కడ వెళ్తుందో అని చూసి ఓర్వలేక ఎక్కడ వాళ్ళ ఓటమి భయంతో మా నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనాన్ని మీరు అడ్డుకోలేరు అనేది తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నాము. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు మాపై ఎన్ని చేసినా చూస్తూ కూర్చోమన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com