ముమ్మిడివరం, (జనస్వరం) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాట్రేనికోన మండలం తిమ్మాపురం గ్రామంలో వృద్దురాలు సంసాని సూర్యకాంతం నివసించే గృహం కూలిపోవటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర జనసేనపార్టీ PAC సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పితాని బాలకృష్ణ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి 25 కేజీల బియ్యం, కిరాణా సామాన్లు, కట్టుకోవడానికి బట్టలు, దుప్పట్లు, అదే విధంగా 3000 రూపాయల నగదు బాధిత కుటుంబసభ్యులకు అందచేశారు. రామస్వామితోటకు చెందిన జనసేనపార్టీ సభ్యుడు మట్టా లోవరాజు గృహం పరిశీలించి ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1000 నగదు అందచేశారు. అదే విధంగా రామస్వామి తోట శివారులో నివాసం ఉండే వృద్దురాలు పెయ్యాల ముకుందం అనే ఆమె గృహం వర్షాలకు పూర్తిగా మునిగిపోయి ఉంటే ఆమెను పలకరించి ఓదార్చి ఆమెకు 25 కేజీల బియ్యం, 1000 రూపాయలు నగదు అందచేశారు. వెంకమ్మ చెరువు వద్ద జనసేన కార్యవర్గ సభ్యుడు గుత్తాల దుర్గాప్రసాద్ తాతయ్య గారు ఇటీవల మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం, కొంత నగదు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు వల్ల పాడైపోయిన ఇళ్ళు, అలాగే వరి పంట పొలాలకు అధికారులను పంపి సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బాధితులకు పరిహారం అందచెయ్యాలని అదే విధంగా ముంపు గ్రామాలలో అంటురోగాలు రాకుండా పంచాయతీ వారు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, మండల జనసేనపార్టీ కన్వీనర్ మోకా బాలప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కాయల బలరాం, మండల కార్యదర్శి సంసాని పాండు రంగారావు, మండల ప్రచార కార్యదర్శి అడపా సాయి, బిమండల కోశాధికారి గిడ్డి రత్నశ్రీ, మండల కార్య నిర్వాహక కార్యదర్శి భీమాల సూర్యనాయుడు, పిల్లి గోపి, కార్యనిర్వాహక సభ్యులు బద్రి నాయుడు, మచ్చ శ్రీను, గుర్రాల బాలరాజు, అదే విధంగా జనసేన నాయకులు గోదాసి పుండరీష్, దూడల స్వామి, నూకలు దుర్గబాబు, అంగాని నరసింహమూర్తి, బళ్ల కుమార్, పాలెపు దనుంజయ, ఓగురి భాగ్యశ్రీ, నూతనబాబు,కడలి వెంకటేశ్వరరావు, పొలిశెట్టి శ్రీనివాసరావు, జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు అదేవిధంగా గ్రామస్తులు సంసాని సత్యనారాయణ, సంసాని శ్రీనివాసరావు, సంసాని వెంకటేశ్వరరావు, సంసాని సూరిబాబు, సంసాని సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com