Logo
Date of Publish : 17 January 2024, 11:36 pm
Editor : Sake Naresh

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అంత సీన్ లేదు : అనంత జనసేన నాయకులు

    అనంతపురం ( జనస్వరం ) : అనంతపురము నియోజకవర్గం నారాయణపురం పంచాయతీలో వైసిపి నిర్వహించిన ఎద్దుల పోటీల కార్యక్రమానికి వచ్చిన వైసిపి నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన స్థాయికి మించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడపై విమర్శించడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం స్థానిక రామ్ నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్యలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆవు చేను మేస్తే దూడ గట్టున వేస్తుందా... ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే ఆయన అడుగులకు మడుగులొత్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంతకు మించి ఇంకేం మాట్లాడతారు అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎద్దుల పోటీకి వచ్చిన ఆయన తెలుగువారి సంస్కృతి గురించి కాకుండా ఎక్కడికి వెళ్లినా.. జనసేన టిడిపిని విమర్శించాలన్న వైసిపి సంస్కృతిని పాటించారన్నారు. అనంతపురము నియోజకవర్గంలో వైసిపి ఓటమి ఖాయమని.. కర్నూలు నుంచి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విషయం బాగా అర్థమైంది కాబట్టే ఓటమి భయంతో అభద్రత భావంతో పవన్ కళ్యాణ్ గారిపై చంద్రబాబు నాయుడు గారిపై వ్యాఖ్యలు చేశారన్నారు. కర్నూల్ నుంచి వచ్చి అనంతపురములో పిచ్చి ప్రేలాపనలు పేలితే నారాయణపురం ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. పవన్ కళ్యాణ్ గారి శ్రీ చంద్రబాబు గారి గురించి మాట్లాడే అంత సీన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి లేదని... జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీని 2024 ఎన్నికల్లో ఓడించి మోకాళ్లపై కూర్చోబెడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు  అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర కార్యదర్శులు అంజి, ఆకుల అశోక్, నాయకులు శ్రీ విజయ్ దేవరయల్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com