Logo
Date of Publish : 17 January 2024, 11:46 pm
Editor : Sake Naresh

యుట్యూబ్ కథలు చెప్పే బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో

    అనంతపురం ( జనస్వరం ) : బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో నీ పిల్ల అతి శ్రేష్టలు, యూట్యూబ్ కథలు ఇక్కడ చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు? నీవెంత నీ బ్రతుకంత? స్థాయిని మించిన మాటలు మాట్లాడొద్దని జిల్లా జనసేన ఉపాధ్యక్షుడు జయరాంరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ నీ ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నామని అన్నారు.  నీకు దమ్ము ధైర్యం సిగ్గు ఉంటే మీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు? విజయమ్మ గారిని గతంలో బొత్స సత్యనారాయణ, మిడతల రజిని గారు లాంటివారు అనేకమంది నోరు హద్దు అదుపు లేకుండా తిట్టారు కదా? మీ అవసరం కోసం వారందరినీ వైసిపి పార్టీలోకి ఆహ్వానించి పదవులు ఎందుకు కట్టబెట్టినావు జగన్ అని? నీతులు కేవలం చెప్పడానికి మాత్రమేనా మీరు మీ నాయకుడు పాటించరా? అని అన్నారు. మా ఊర్లో అభివృద్ది అని పిల్ల పిట్ట కథ చెప్పితివి....బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీవు కర్నూలు జిల్లాకు ఒక వలస పక్షివి? మీ కుటుంబ సభ్యులందరూ డాక్టర్ వృత్తి కొనసాగిస్తూ కడపలోనే ఉంటారు కదా? ముచ్చుమర్రి గ్రామంలో ఇంకా రైతు భరోసా కేంద్రం నిర్మాణంలోనే ఉంది కదా? నిర్మాణం పూర్తి అయి ఎన్ని రోజులకు రైతులకు అందుబాటులోకి వస్తుందో చెప్పగలవా?ప్రాథమిక స్కూల్ల ప్రహరీ గోడలు నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ముచ్చుమర్రి గ్రామంలో ఒక్క రోడ్డు అన్న కనీసం వేయించావా? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముచ్చుమరి గ్రామంలో ఎందుకు ఆడించలేకపోయావు? ముచ్చుమర్రి గ్రామంలో ఊరి బయట లబ్ధిదారుకు గృహాలు కేటాయించారని అన్నారు. కనీసం ఒక ఇంటి నిర్మాణం నేటికీ పూర్తి అయిందా చెప్పగలవా? ఆర్ .బి. కే సెంటర్ ఎక్కడ ఉంది? ధోబి ఘాట్ లో అవినీతి జరిగింది వాస్తవం కదా? ముచ్చుమర్రి గ్రామానికి వస్తాం బహిరంగ చర్చకు నీవు సిద్ధమా? అన్నారు. ముచ్చుమర్రి గ్రామంలో మీ ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుండి నీ దురాగతాలకు హద్దు అదుపు లేకుండా పోయింది, నీవు ఎంతమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి కార్యకర్తల జీవితాలు నాశనం చేశావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నీ మాట వినలేదని నెల రోజుల క్రితం కొంతమంది గ్రామ ప్రజలను పోలీస్ స్టేషన్ లో పెట్టి కళ్ళకు గంతలు కట్టి పోలీసు వారి చేత థర్డ్ డిగ్రీ చేయించి హింసించింది వాస్తవం కాదా, వారందరూ నేడు బెయిలు పైన బయటకు వచ్చారు కదా గురిగింజ తన నలుపు ఎరగదు అన్నట్టు అనంతపురం కు వచ్చి నీవు పిట్టకథలు చెప్పితే నీ బాగోతం ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడు లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటావు. జనసేన - టిడిపి పొత్తు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ అపద్ధపు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com