Logo
Date of Publish : 25 April 2026, 10:00 pm
Editor : Sake Naresh

ఆర్.సి. టైమ్స్ అధినేత ఏమినేని రవిచంద్రకు ఘనంగా ‘బహుజన బంధు’ అవార్డు ప్రదానం

అనంతపురము, ఏప్రిల్ 25, (జనస్వరం) : ఆర్.సి. టైమ్స్ ఛానల్ అధినేత, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రంగస్థల నటుడు ఏమినేని రవిచంద్రకు "బహుజన బంధు" అవార్డును ప్రదానం చేశారు. నక్కా రామారావు యాదవ కళ్యాణమండపంలో శనివారం డాక్టర్ పోతుల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు సోషల్ మీడియా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. మూడు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో పనిచేసిన ఏమినేని రవిచంద్ర గతంలో రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ జర్నలిస్టు అవార్డును అందుకున్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం మీద పరిశోధనాత్మక కథనాలను అందించినందుకు గాను ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆర్.సి. టైమ్స్ ఛానల్ ను ప్రారంభించి రైతుల కృషిని లోకానికి చాటి చెబుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ, పౌరాణిక నటుడిగా, జర్నలిస్టుగా దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రవిచంద్రకు అవార్డు దక్కడం అభినందనీయమన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గ్రామీణ జర్నలిస్టుగా రెండుసార్లు అవార్డును అందుకున్నారనీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసి నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com