
బద్వేల్ ( జనస్వరం ) : బద్వేల్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కి మద్దతుగా “పూరమావిళ్ల” మండల విస్తృత సమావేశం జనసేన నాయకులు సోమి శెట్టి చిన్న ఆధ్వర్యంలో పూరమావీళ్ళ టౌన్ కమ్మావారిపాలెం లో జరిగింది. ఈ కార్యక్రమoలో త్రిసభ్య కమిటీ సభ్యులు తాతంశెట్టీ నాగేంద్ర, ముఖరం చాన్, సుంకర శ్రీనివాస్ గార్లు దిశానిర్దేశం చేశారు. వీరితో పాటు బద్వేల్ నియోజక వర్గ నాయకులు బసివి రమేష్, తుడిమెల్ల మురళి, ఈశ్వర్ రెడ్డి మరియు స్థానిక మండల నాయకులు తోట బాలచంద్ర, లక్ష్మీపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.