Logo
Date of Publish : 17 September 2022, 4:00 pm
Editor : Sake Naresh

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పవనన్న షణ్ముఖ వ్యూహం

- పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

         ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 7వ రోజున వెంకట్రావుపల్లిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన నలిశెట్టి శ్రీధర్ ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ రూపొందించిన షణ్ముఖ వ్యూహాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం అని తెలిపారు. ప్రజలందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, పవనన్న ప్రభుత్వంలో షణ్ముఖ వ్యూహంలోని ప్రణాళికలు అమలుపరుస్తాం అని అన్నారు. యువతకు రుణ సాయం, మహిళలకు భద్రత, రైతులకు భరోసా షణ్ముఖ వ్యూహంలో ముఖ్య అంశాలని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజల జీవన పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడం, విద్యావ్యవస్థలో సంస్కరణల ప్రణాళికలను పవన్ కళ్యాణ్ గారు రూపొందిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలందరు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు చంద్ర, వంశీ, సురేష్, ప్రసాద్, అరవింద్, అనిల్, నాగరాజు, భాను కిరణ్, తిరుమల, పవన్, శ్రీహరి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com