Logo
Date of Publish : 01 April 2022, 9:14 am
Editor : Sake Naresh

రాష్ట్రమంతటా బాదుడే.. బాదుడు

● ఏప్రిల్‌ 1న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసేన నిరసన
● ఒక అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం
● అన్నింటిపై ‘‘బాదుడే - బాదుడు’’ అంటూ సాగుతున్న పాలన
● ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు షాక్‌ ఇచ్చిన ప్రభుత్వం
● ఎన్నికల ప్రచారంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీ ఏమైంది..?
● విద్యుత్‌ చార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటం చేస్తాం
● పథకాల పేరుతో ఒక చేత్తో రూ.10 ఇచ్చి... ఇంకో చేత్తో రూ.20 వసూలు
● రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
       అమరావతి, (జనస్వరం) : ఒక్కసారి పవర్‌ ఇవ్వండి నా పవర్‌ ఏంటో చూపిస్తా అంటూ విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి వైసీపీ నాయకత్వం తన పవర్‌ ఈ విధంగా చూపించుకుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ గురువారం తీవ్రంగా విమర్శించారు. ఉగాది కానుకగా రూ.1400 కోట్ల విద్యుత్‌ ఛార్జీల వడ్డింపుతోపాటు ట్రూ అప్‌ ఛార్జీల పేరిట మరో రూ. 3వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. ఆదాయం లేదు... రాబడి లేదు... ట్యాక్సుల మీద ట్యాక్సులు మాత్రం వేస్తున్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్‌పై అధిక వ్యాట్‌, లిక్కర్‌పై అయితే సరే సరే. ఇప్పుడు విద్యుత్‌ ఛార్జీలు కూడా పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారు. సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో రూ. 20 లాక్కుంటున్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీ ఏమైంది?
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఫ్రీ అని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటను మరిచిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఉన్న మనం... ఇవాళ అప్రకటిత విద్యుత్‌ కోతలతో అల్లాడిపోతున్నామన్నారు. గ్రామాల్లో 3 నుంచి 6 గంటల వరకు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై బాదుడే బాదుడు అని మాట్లాడిన మీరే... ఈ రోజు విద్యుత్‌ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలి? బాదుడే బాదుడు అనాలా? ఇంకేం అనాలో మీరే చెప్పండి. ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదు తెల్లారిందంటే చాలు... జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలకు నిరసనగా అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల ముందు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందన్నారు. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందజేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com