
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు నుండి కంభంపాడుకు ప్రత్తి తీయడానికి కూలీలతో వస్తున్న ఆటో కంభంపాడు గ్రామానికి కిలోమీటర్ దూరంలో మునేటి కాలువ వద్ద ఆటో అదుపుతప్పి కాలువలో పడిపోవడం జరిగింది. ఈ ఘటనలో కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి భాదితులకు ప్రధమ చికిత్చ అందించి వత్సవాయి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. దయచేసి సమాజం పట్ల అందరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పూర్తి ద్వారా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, మీరు కూడా మీ వంతు సహాయంగా మానవత్వంగా ఆపదలో ఆదుకోవాలని కోరారు. స్థానిక ప్రజలు బాడిశ మురళీకృష్ణకు అభినందనలు తెలిపారు.