● దుష్ప్రచారాలు మానుకోవాలి
● దళితులంటే తోట త్రిమూర్తులుకు ద్వేషం
● వల్లూరు వివాదంపై న్యాయవిచారణకు సిద్ధమా?
దళితుల కోసం పోరాడే నాయకుడు వేగుళ్ళ లీలాకృష్ణ
మండపేట, (జనస్వరం) : దళితుల కోసం ఎల్లవేళలా పాటుపడే జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ గారిని వైసిపి దళిత నాయకులు విమర్శించడం సరికాదని వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనా కుమారి పేర్కొన్నారు. మండపేట ఏడో వార్డులో వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనా కుమారి దళిత నాయకులతో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను దళిత సర్పంచ్ అనే కదా పంచాయతీతో జరగాల్సిన పెన్షన్లు పంపిణీ శివాలయం దగ్గర పెట్టారు. ఇంత కన్నా అవమానం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇటీవల వైసిపి దళిత నాయకులు వేగుళ్ళ లీలాకృష్ణపై అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. దళితుల సమస్యల పట్ల వేగుళ్ళ లీలాకృష్ణ ఎప్పుడూ పోరాడుతూ ఉంటారని అలాంటి నాయకుడిని విమర్శించే నైతిక హక్కు వైసిపి దళిత నాయకులకు లేదని అన్నారు. అనంతరం జనసేన దళిత నాయకులు మాట్లాడుతూ లీలాకృష్ణ దళిత ద్రోహి అని వైసిపి నాయకులు అవాకులు చవాకులు పేలడం పట్ల తీవ్రంగా ఖండించారు. వల్లూరు గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న జనసేన దళిత మహిళా సర్పంచ్ ను త్రిమూర్తులు దూషించిన ఫుటేజ్ పై ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. దీనిపై వల్లూరులో ప్రతి గడప నుండి తోట వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తారని పేర్కొన్నారు. దీనిపై న్యాయ విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. తోట త్రిమూర్తులకు దళితులంటే ద్వేషమని ఆరోపించారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే దళితుల కోసం పోరాడదాం రండి అంటూ వైసిపి దళిత నాయకులకు సవాల్ విసిరారు. తోట త్రిమూర్తులు మండపేట ఇన్చార్జిగా వచ్చినప్పటి నుండి దళితులపై పోలీస్ కేసులు ఎక్కువయ్యాయని వైసిపి దళిత నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వైసీపీ పాలనలో దళిత వాడలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదని గుర్తు చేశారు. కావాలంటే బహిరంగ చర్చకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సరాకుల అబ్బులు, పెయ్యిల ఏకబు, 8వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ జొన్నాడ పాపమ్మ, పైడిమళ్ళ సతీష్ తదితరులు పాల్గొన్నారు.