అనంతపురం ( జనస్వరం ) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 217 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ వడ్డెర ఐక్యత ఎస్టీ సాధన సమితి సభ్యులు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత హాజరై వడ్డే ఓబన్న గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వడ్డెర్లు దాదాపు 35 లక్షల మంది ఉన్నారని వారిదామాషా ప్రకారం రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తూ వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి వడ్డెర్లను నమ్మించి మోసం చేశాడని అన్నారు. ఇసుక కొరత తీవ్రంగా ఉండి వడ్డెర్ల ప్రధాన జీవనాధారమైన భవన నిర్మాణం దెబ్బతిని ఆ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో దాపరించాయని అన్నారు. కచ్చితంగా మీ సమస్యలను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతామన్నారు. తరతరాలుగా రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెర కార్మికులు ఆరోగ్య ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని వడ్డెర్ల కార్పొరేషన్ నిధులు పెంచి ఆ నిధులు సకాలంలో విడుదల చేసి వడ్డెర్లను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర్ల ఎస్టీ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కుల్లాయప్ప, రాష్ట్ర అధ్యక్షులు వడ్డే సురేష్, ఉపాధ్యక్షులు నాగేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు పీట్ల ఆనంద్, సలహాదారులు మల్లెల కాసిం సాకే నాగరాజు, కుమార్ మహేష్ రామాంజనేయులు, కుంచపు లక్ష్మన్న, గోగుల వెంకటనారాయణ, కుమార్ ఎర్రి స్వామి, వంశీ రామకృష్ణ, జనసేన పార్టీ వీర మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.