
గుంతకల్ ( జనస్వరం ) : జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సేవాస్పూర్తితో గుత్తి పట్టణానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు నిస్వార్థ జనసైనికుడు కిరణ్ కుమార్ కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోయారు… గుత్తి జనసేన నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గం గెలిచిన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున సహాయం అందించడానికి కృషి చేస్తూ ఎల్లప్పుడు మీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఏ చిన్న అవసరం వచ్చినా మాకు తెలియజేయండి అని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మండల అధ్యక్షులు పాటిల్ సురేష్, చిన్న వెంకటేశులు సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు, హేమంత్ రాయల్, హాసన్ గుత్తి, పట్టణ మరియు మండల, నిస్వార్థ జనసైనికులు గుంతకల్ జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…