విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడరామకృష్ణారావు (బాలు) గారి ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న కాలనీలో మరియు ఎస్.కే. డిగ్రీ కళాశాలలోను మహమ్మారి కరోనా మూడో వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్ ఆదేశాలు మేరకు కరోనా రాకుండా అప్రమత్తలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడియున్న అవగాహనను ప్రజలకు కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మరియు ఎస్బిసిసి జిల్లా కోఆర్డినేటర్ బి.రామకృష్ణ గారు ప్రజలకు ఇంటి ఇంటికీ వెళ్లి కరోనా మూడోవేవ్ లో వస్తే తీసుకొనే జాగ్రత్తలను ప్రజలకు, కళాశాల విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ ప్రజలంతా ముఖ్యంగా మాస్కులు వాడితే 95 శాతం కరోనా రాకుండా కాపాడుకోవచ్చని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రపరుచుకోవాలని, ఎక్కువగా ప్రజలు గుమిగూడిన ప్రాంతాల్లో తిరగరాదని, ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలని, కరోనా పై నిర్లక్ష్యం వద్దు అని, మూడో వేవ్ లో మనం ఈ అవగాహన తోనే ప్రజలను కాపాడుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీనాయకులు, జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు పిడుగు సతీష్, చిరంజీవి యువత సభ్యులు పతివాడ అబ్బు, కొలుసు మారయ్య, పతివాడ శ్రీను, యాగాటి నలమరాజు, అప్పారావు, ఎస్.కె. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాయుడు, వార్డెన్ విష్ణు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com