పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నేతల వ్యక్తిగత దూషణలు మానుకోండి? కదిరి ఇంఛార్జ్ భైరవ ప్రసాద్

  కదిరి, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో గత మూడు సంవత్సరాల నుంచి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి 30 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులు అంద జేయడం జరిగింది. అలాగే వారి కుటుంబాలకు, వారి పిల్లలు చదువుకోవడం కొరకు ప్రత్యేకనిధి ఏర్పాటు చేస్తామని తెలిపిన జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ ఎమ్మెల్యేలు శంకర నారాయణ, ప్రకాష్ రెడ్డి వ్యక్తిగత దూషణలు, విమర్శలు, అవాకులు చవాకులు మాట్లాడడం మానుకుని, మీకు చేతనైతే మీ ప్రభుత్వ హయాంలో పూర్వపు అనంతపురం జిల్లాలో 175 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం 7 లక్షల రూపాయలు అందివ్వాలని కదిరి జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. మాజీమంత్రి శంకర నారాయణ మీరు అసమర్థుడని మిమ్మల్ని ముఖ్యమంత్రి మంత్రిగా తప్పించారు. దాన్ని తట్టుకోలేక రైతులకు మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తే ప్రజలు, జనసేనపార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నిన్ను తరిమి తరిమి రాళ్ళతో కొట్టేరోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. మీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి మీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం గురించి, తుంపర సేద్యంకు కావాల్సిన వస్తువులు పైపులు, మల్చింగ్ షీట్లు, సింకర్లు లాంటివి గతంలో తొంభై శాతం సబ్సిడీపై ఇచ్చేవారు. మీ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అలాగే స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలాగా చేయండి. గతంలో మీరు మంత్రిగా ఎన్ని రోడ్లు వేయించారు అది ప్రజలకు చెప్పండి అంతే కాని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు చేస్తే చూస్తు ఉరుకొము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాయవాది రవీంద్ర, చలపతి, అనుప్రసాద్, చెక్క రమణ, లక్ష్మణ్, అంజిబాబు, శేఖర్, రాజేంద్రప్రసాద్, విష్ణు, నరేంద్ర, కార్తిక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way