ధర్మవరం, (జనస్వరం) నవంబర్ 7 : ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలను మానుకొని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మంగళవారం వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సమావేశాలు నిర్వహించిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పైన ప్రతిపక్షాల పైన బురద చల్లడం వారికి అలవాటైపోయిందని, ఆది మానుకొని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు పై దృష్టి పెడితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని తెలిపారు. ప్రతిపక్షాలను విమర్శించడం ఒక పనిగా పెట్టుకోకూడదని హితవు పలికారు. సమావేశాలకు రావాలని బెదిరింపులు, ఒత్తిడిలు తేవడం ఇకనైనా మానుకోవాలన్నారు. సచివాలయ వ్యవస్థలో రైతులకు పూర్తి న్యాయం జరగటంలేదని బిక్షగాలుగా తయారవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, నియోజకవర్గంలో దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇందుకు నా దగ్గర సాక్షాలు కూడా ఉన్నాయని వారు తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యవస్థలను దెబ్బతీసే పనిని మానుకోవాలన్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం పద్ధతి కాదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావుని తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పే మాటలు ప్రజలు నమ్మరని చరిత్రలే సాక్షాలుగా ఉన్నాయని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలోని రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి దశలో ఆదుకునే విధంగా యుద్ధ ప్రాతిపథకాన చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఆనాడు కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే జనసేన పార్టీ అధినేత కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్నది నిజము కాదా? అని వారు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. దాడులు జరపడం, అక్రమ కేసులను పోలీసుల ద్వారా పెట్టించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఇవి అన్నియు కూడా ముఖ్యమంత్రికి కనిపించవా? అని వారు అడిగారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు యొక్క అక్రమాలు, దందాలుపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టి, చర్యలు చేపట్టి, వారిని కట్టడి చేసిన తర్వాత తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు.