Logo
Date of Publish : 15 June 2022, 3:38 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు మానుకోండి : కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్

       కదిరి ( జనస్వరం ) : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు మా జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని, అలాగే చనిపోయిన ఒక్క కౌలు రైతును చూపించలేక పోయారని చెప్పడాన్ని కదిరి జనసేనపార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని కదిరి జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ పరిధిలో దాదాపు 13 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అలాగే కడప జిల్లాలో 130 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నరని, అవి మీకు తెలియక పోతే మా పార్టీ ఆఫీసులో అడిగితే తెలియజేస్తామని, మీలాంటి స్థాయి వ్యక్తులు అబద్ధాలు మాట్లాడడం సమంజసం కాదన్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనంతపురం పర్యటనకు వచ్చే ముందు హడావుడిగా కొద్దిమందికి డబ్బులు వాళ్ళ అకౌంట్లలో ఎందుకు జమచేశారని, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని మీరు ఓట్ల కోసం ఏమైనా మాట్లాడతారని తెలిపారు. అలాగే కోనసీమ అల్లర్లలో మీ పార్టీ వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ఓట్ల కోసం, సీట్ల కోసం వైసీపీ పార్టీ తప్పుడు విధానాలు అనుసరిస్తుందని, జనసేనపార్టీ ఎప్పుడూ ప్రజాసమస్యలపై నీతిగా, నిజాయితీగా పనిచేస్తుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com