
అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలంలో చల్లపల్లి-అవనిగడ్డ రహదారి బస్ స్టాండ్ సమీపంలో రోడ్డు మీద గుంతలు పడి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతుండటంతో జనసేన పార్టీ కార్యకర్తలు తమ సొంత ఖర్చుతో గుంతలు పడిన రోడ్డుని బాగుచేయించారు. జనసేన పార్టీ కార్యకర్తలు చేసిన కృషిని స్థానికులు అభినందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేయాల్సిన పనులు సామాన్య జనసైనికులు చేయడం దురదృష్టకరం అన్నారు. పలుమార్లు అధికారాలకు వినతులు అందించినా ఫలితం లేకపోయింది. అందుకే జనసైనికులే ముందుకు వచ్చి తమ స్వంత డబ్బులతో రహదారికి మరమ్మత్తులు చేయడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని రహదారులను వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు కలపాల ప్రసాద్, ముత్యాల ప్రసాద్, బొందలపాటి వీరబాబు, సాయికృష్ణ, గణేష్, వెంకన్న, దొరబాబు వంశీ, హర్షవర్ధన్ పాల్గొన్నారు.