Logo
Date of Publish : 10 November 2020, 4:27 pm
Editor : Sake Naresh

భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్న అవనిగడ్డ జనసేన నాయకులు

భూములకు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్న అవనిగడ్డ జనసేన నాయకులు

           కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం 14 వేల ఎకరాల కండిషన్ పట్టా భూములు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేక 10 వేల 500 మంది రైతులు ఇబ్బంది పడుచున్నారు. కేవలం కోడూరు మండలంలో 10,630 ఎకరాలు కండిషన్ పట్టాలు కలిగిన భూమి, 20 వేల ఎకరాలు పైన 22a నిషేధిత జాబితాలో చేరిన భూములు ఉన్నాయి అని రాయపూడి అన్నారు.  ఎన్నికలు ముందు రాజకీయ పార్టీలు పోరాటాలు చేసి, హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చక పోవటం చాలా బాధాకరం. ఈరోజు కండిషన్ పట్టాలు ఉండి 22a (చుక్కలు భూములు) నిషేధిత జాబితాలో ఉండుట వలన, బ్యాంకు రుణాలు రాక, రిజిస్ట్రేషన్ అవ్వక, భూములు ఉండి కూడ పిల్లలు చదువులకు, పిల్లలు పెళ్ళిలకీ, వైద్య ఖర్చులకు కూడ డబ్బులేక, అప్పులు పుట్టక, రైతులు ఇబ్బంది పడుచున్నారు అని జనసేన నాయకులు అన్నారు. భూములు ఉండి కూడా ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. ఈ సమస్య పై జనసేన పార్టీ చాలా కాలం నుండి పోరాటం చేయ్యటం జరుగుతున్నది. కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, ఘంటశాల మండలాల్లో MRO ఆఫీసులలో వినతిపత్రంలు ఇవ్వటం జరిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఒక్క రోజు శాంతియుత దీక్ష కూడ చెయ్యటం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఈరోజు వరుకు చలనం లేదు. గత రెండు రోజులు క్రితం కోడూరు MRO గారి ఆఫీసులో 22a నిషేదిత జాబితా తీసుకోవటం జరిగింది అని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున రెండు రోజులలో 22a నిషేధిత జాబితాలో ఉన్న భూములు నివేదిక జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికీ ఇవ్వటం జరుగుతుంది అని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నియోజకవర్గంలో పాదయాత్ర చేయటం జరుగుతుంది అని అన్నారు. ఒక 15 రోజులలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన చెయ్యటం జరుగుతుంది అని జనసేన నాయకులు తెలిపారు. కోడూరులో ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి కొండవీటి సునీత గారి ఇంటి వద్ద సమావేశం అయ్యి భవిష్యత్తు కార్యాచరణ గురించి జనసేన నాయకులు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో కోడూరు జడ్పీటీసీ అభ్యర్థి సిద్దినేని అశోక్ నాయడు గారు, ఎంపీటీసీ అభ్యర్థి కొండవీటి సునీతా గారు, ఉల్లి శేషగిరి గారు, తోట నాగరాజు, తోట సోమశేఖర్ గారు, మత్తి సుబ్రహ్మణ్యం, చందు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com