Logo
Date of Publish : 23 September 2021, 12:33 pm
Editor : Sake Naresh

అవాకులు, చవాకులు మానుకోవాలి – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు

- మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేసే అవినీతి ,అక్రమ వ్యవహారాల పై సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలి
- ఒక పనికిమాలిన దద్దమ్మకి 42 డివిజన్లో ఓట్లేసి గెలిపించమని ప్రజలు తలలు పట్టుకు కూర్చున్నారు
- భోగవల్లి సత్రం ట్రస్ట్ భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓఎస్డీ అశోక్ ను ఇక్కడ విధుల నుండి తొలగించి మాతృ సంస్థకు సరెండర్ చేశారంటే ఈ ట్రస్ట్ విషయంలో అక్రమాలు జరిగాయని మంత్రిగా స్వయంగా ఒప్పుకున్నట్టే కదా దానికి మీ ప్రెస్ మీట్ ఏంటి?
- అవినీతి దద్దమ్మ కార్పొరేటర్
మహేష్ నిరంతర పోరాటం వల్లనే దుర్గగుడిలో కొంతవరకైనా అవినీతి తగ్గింది
- చైతన్య రెడ్డి మీకు మీ మంత్రికి బడుగు బలహీన వర్గాల నాయకులంటే చిన్న చూపేనా
              విజయవాడ, (జనస్వరం) : సితార కన్వెన్షన్ దగ్గర విజయవాడ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లింగం శివ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి తిరునగరి మురళీకృష్ణ , జనసేన మహిళా నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి బొమ్మ గోవింద లక్ష్మిలు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహిళా నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే అవినీతి, అక్రమ వ్యవహారాలపై సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్న జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలన్నారు. ఒక పనికిమాలిన దద్దమ్మకి 42 డివిజన్లో ఓట్లేసి గెలిపించమని ప్రజలు తలలు పట్టుకు కూర్చున్నారని, గెలిచిన తర్వాత డివిజన్లో కార్పొరేటర్ చైతన్య రెడ్డి కనబడడం లేదని ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారన్నారు. వైసీపీ స్థానిక నాయకులు మద్దతుదారులు గుంటూరు వారి వీధిలో నీళ్లు మురికి వాసన వస్తున్నాయిని, రంగు మారాయని, మీకు తెలియజేస్తే తమరు స్పందించలేదని వారు జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ కి తెలియజేస్తే వెంటనే వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి తక్షణమే విజయవాడ మున్సిపల్ కమిషనర్ కి తెలియజేసిన నాలుగు రోజుల్లోనే సమస్య పరిష్కారం చేశారని తెలిపారు. మానవ మందిరం రోడ్డు డివిజన్లో పలు గోతులు పడ్డ రోడ్లను సందర్శించి మరమ్మతులు చేయాలని, తమరు చెయ్యని పనిని మహేష్ జనసేన పార్టీ నాయకులతో కలిసి సందర్శించి కమిషనర్ కి స్పందనలో వినతి పత్రం మా నాయకుల ద్వారా సమర్పించారని, చిన్నపాటి వర్షానికి విఎంసి పార్క్ అస్తవ్యస్తం అయితే కనీసం స్పందించని మీరు దద్దమ్మ కార్పొరేటర్ రని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు స్థానికులు మీ వల్ల సమస్యకు పరిష్కారం కాదని తెలిసి పోతిన మహేష్ ని సంప్రదించారో, మీకు అర్ధం అయి ఉండాలి మీరు పెద్ద దద్దమ్మ అని, సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి అక్రమ సంపాదన పై దృష్టి పెట్టిన మీరు మా గురించి మాట్లాడితే ఆకాశం మీద ఊమ్ము వేసినట్టేనని అన్నారు. ఎన్నికల్లో భాగా డబ్బు ఖర్చు పెట్టను ఆశించిన స్థాయిలో డబ్బులు రావట్లేదని మీ మామ మీతో బాగా గొడవ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిందని ముందు దానికి సమాధానం చెప్పాలని, అవినీతి దద్దమ్మ కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు? చుక్కల భూములు కొట్టేయాలని భవానిపురం లో తమరు చేసే ప్రయత్నాలను ఆధారాలతో సహా అతి తొందరలో బయట పెడుతామని విజయలక్ష్మి హెచ్చరించారు. అనంతరం విజయవాడ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి తిరునగరి మురళీకృష్ణ మాట్లాడుతూ భోగవల్లి సత్రం ట్రస్ట్ భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓఎస్డీ అశోక్ ను ఇక్కడ విధుల నుండి తొలగించి మాతృ సంస్థకు సరెండర్ చేశారంటే ఈ ట్రస్ట్ విషయంలో అక్రమాలు జరిగాయని మంత్రిగా స్వయంగా ఒప్పుకున్నట్టే కదా దానికి మీ ప్రెస్ మీట్ ఏంటి? అని, మంత్రి పేషిలో విద్యాధరరావు కూర్చున్నారా లేదా అక్కడినుంచే అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారా లేదా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసే దమ్ము ఉందా లేదో దద్దమ్మ కార్పొరేటర్ చైతన్య రెడ్డి ముందు దీనికి సమాధానం చెప్పాలన్నారు. మహేష్ నిరంతర పోరాటం వల్లనే దుర్గగుడిలో కొంతవరకైనా అవినీతి తగ్గిందని, ఆయన పోరాట బట్టే అమ్మవారి ఆలయంలో ఏసీబీ విజిలెన్స్ రైడింగ్ జరిగే ఈవో సురేష్ బాబును విధుల నుండి తొలగించారని, బ్రాహ్మణ వీధిలో కొత్త వెంకటేశ్వర స్వామి గుడికి చెందిన 350 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడారని, భవానిపురంలో గాలిబ్ సాహెబ్ దర్గాకు చెందిన విలువైన భూములను మంత్రి సన్నిహితులు అక్రమ కాంట్రాక్టర్ ద్వారా ఆక్రమించుకుని వ్యాపారాలు చేసుకోవడం లేదా? అని, వీఎంసీలో 150 ఉద్యోగాలు అమ్ముకొని మూడు కోట్లు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేస్తే నిరుద్యోగులకు అండగా నిలబడింది మహేష్ అని, సత్యనారాయణపురంలో కాశీ అన్నపూర్ణేశ్వరి స్వామి ఆలయానికి సంబంధించిన కమర్షియల్ స్థలం కాజేసి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నమని, అన్ని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని, తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని, ప్రజలకి అండగా నిలబడుతుంది మేము మాత్రమేనన్నారు. చైతన్య రెడ్డి మీకు మీ మంత్రికి బడుగు బలహీన వర్గాల నాయకులు అంటే చిన్న చూపేనా ప్రశ్నించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com