Logo
Date of Publish : 30 June 2022, 4:09 pm
Editor : Sake Naresh

ఆటో ప్రమాదం – బాధితులని పరామర్శించిన అనంత జిల్లా జనసేన నాయకులు

     తాడిమర్రి, (జనస్వరం) :  ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లి గ్రామ సమీపంలో గుడ్డంపల్లి గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ వైర్లు తగలడంతో ఆటో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఘటన స్థలానికి విచ్చేసి ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పరిశీలిస్తూ మృతుల కుటుంబాన్ని పరామర్శించి భౌతిక కాయాలను పరిశీలించి తీవ్ర ఆవేదనకు గురై మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనంటు మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి క్షతగాత్రులకు 10 లక్షల రూపాయలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com