
పామర్రు (జనస్వరం) : రెండు రోజుల క్రితం పామర్రు గ్రామంలోని చల్లపల్లి రోడ్డు గోతులు పడి అధ్వానంగా మారిందని జనసేన పార్టీ ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారు స్థానిక ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. జనసేన చేపట్టిన నిరసనకు ఆధికారులలో చలనం వచ్చి వెంటనే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు నరేష్ గారికి ధన్యవాదములు తెలిపారు. మీద్వారా మా సమస్యకు పరిష్కారం లభించిందని, స్థానిక ప్రజలు అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నరేష్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాంలో నియోజకవర్గ జనసైనికులు కూనపరెడ్డి సుబ్బారావు, కొప్పరాతి శ్రీకాంత్, క్రాంతి, లంక, కిషోర్, వీరస్వామి, అంజిబాబాబు తదితరులు పాల్గొన్నారు.