పశ్చిమగోదావరి ( జనస్వరం ) : అత్తిలి నియోజకవర్గంలో జిల్లా కార్యదర్శి అన్నెం విశ్వప్రభు గారి నాయకత్వంలో క్రియాశీలక సభ్యత్వం యొక్క విధివిధానాలు, అవశ్యం గురించి జనసైనికులకు వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏరాజకీయ పార్టీకూడా ఇంతవరకు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించలేదని,కేవలం జనసేన పార్టీకి మాత్రమే చెల్లిందని, ఈ అవకాశాన్ని ప్రతీఒక్క కార్యకర్త వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్లకి అనుకోకుండా ఎటువంటి ప్రమాదం అయినా జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేలు, మరణించినట్లయితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంటా నాగరాజు, బడేటి కృష్ణ, బడేటి త్రినాధ్, శ్రీమతి పుప్పాల కుమారి, గూడపాటి రాకేష్, జవ్వాది రామ్ ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.