ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలులో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి రాయపాటి అరుణ గారు మీడియాతో మాట్లాడుతూ మహిళల పై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయి అని, ప్రతి రోజు రాష్టంలో ఏదో ఒక చోట మహిళలు హింసకి గురవుతున్నారు అని అన్నారు. చట్టంలో ఉన్న లోపాలు ఆసరాగా చేసుకొని దూర్మార్గులు ఇలాంటి దాడులకి పాల్పడుతున్నారు. చట్టాలు రూపొందించటమే కానీ అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం అవుతుంది అని ప్రచార అర్భాటమే కానీ దిశ చట్టం ఎక్కడా సరైన రీతిలో అమలు జరగటం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన, మహిళలు, బాలికలు అత్యాచారాలు హత్యలు, శారీరక దాడులకి గురి అవుతున్నారు అని అందుకు ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లో నర్స్ మీద జరిగిన దాడి ఒక ఉదాహరణ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధితుల పట్ల అండగా నిలిచి నిందితులకు త్వరిత గతిన శిక్ష పడేలా చేయాలన్నారు. మహిళలపై ప్రతిచోట ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అనీ జనసేన తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలియచేసారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించని యెడల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రియాజ్ గారి సారథ్యంలో ఉద్యమిస్తామని తెలియచేసారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com