Logo
Date of Publish : 30 July 2022, 12:56 pm
Editor : Sake Naresh

పాత్రికేయులపై దాడులు సమర్థనీయం కాదు : జనసేన నాయకురాలు దారం అనిత

     మదనపల్లి,(జనస్వరం) : రాష్ట్రంలో పాత్రికేయులపైన దాడులు రోజురోజుకు పెరిగిపోయాయని, మదనపల్లిలో విలేఖరి వెంకశివపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్‌ చేశారు. వైసిపి భూకబ్జాదారుల దాడిలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో వెంకటశివ చికిత్స పొందుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత రాష్టంలో పత్రికలపైన, పాత్రికేయలపైన దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయంగా వార్తలు రాసే వెంకట శివపై వైసిపి నాయకుల దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు. వైసిపి నాయకులు చేసే భూ కబ్జాలపై వార్త రాసిన వెంకట శివపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ‌కేసు నమోదు చేయని పక్షంలో జనసేన తరుఫున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com