అనంతపురం ( జనస్వరం ) : ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. భౌతికంగా దాడులు చేస్తే జనసేన నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, రాష్ట్ర కార్యక్రమముల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ అన్నారు. మేము తిరిగి ప్రతిఘటిస్తే మీ పరిస్థితి ఏంటో ఒక మారో అర్థం చేసుకోండి? తక్షణమే ధర్మవరం పోలీసు వారు ఈ సంఘటన పైన తగిన విచారణ చేసి దాడికి పాల్పడిన వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. జనసేన పార్టీ ధర్మవర౦ చిలకం మసూదన్ రెడ్డి గారికి మరియు ధర్మవరం నియోజకవర్గపు జనసేన నాయకులు కార్యకర్తలకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఇలాంటి దాడులు మరొకసారి పునరావృత్తం కాకుండా ధర్మవరం పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com