బొబ్బిలి ( జనస్వరం ) : రామభద్రపురంలో స్టేట్ హైవేకి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్థానిక వైసిపి నాయకుడు ప్రభుత్వ పెద్దల అండదండలతో చేసిన భూకబ్జాపై ప్రశ్నించినందుకు జనసైనికులపై దాడి చేశారన్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి రామభద్రపురం మండల నాయకులు మహంతి ధనుంజయ్ పై వైసిపి గూండాలు యత్నించిన దాడిని ఖండించారు. పాలూరు గారు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వ స్థలం తిరిగి ప్రజల ఉమ్మడి ఆస్తిగా మార్చేవరకు జనసేన పోరాటం కొనసాగుతుందని, మిగతా పార్టీల నాయకుల్లాగా జనసైనికులను ప్రలోభ పెట్టలేరని అన్నారు. దాడులతో భయపెట్టాలని చూస్తే మా పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని కబ్జాదారుల్ని హెచ్చరించారు. ఈ స్థలం విషయంలో న్యాయ పోరాటానికి కావలసిన లీగల్ సపోర్ట్ పార్టీ నుంచి రామభద్రపురం జనసేన టీంకి పూర్తి స్థాయిలో లభిస్తుందని, ధైర్యంగా పోరాటాన్ని కొనసాగించండని ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్, బొబ్బిలి నాయకులు పల్లెం రాజా, సీతానగరం నాయకులు పోతల శివశంకర్ రామభద్రపురం యువ నాయకులు చీమల సతీష్, అల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com