Logo
Date of Publish : 30 May 2023, 3:54 pm
Editor : Sake Naresh

తాగునీటి సమస్య తీర్చమంటే జనసేన నేతలపై దాడులు

      పార్వతీపురం ( జనస్వరం ) : బలిజిపేట మండలం, బర్లి గ్రామంలో వైసిపి MLA జోగారావు పర్యటన నేపధ్యంలో మా జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బంకురు పోలినాయుడు, జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి గంట్యేడ స్వామి నాయుడు బర్లి గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం చాలా ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో ఊరంతా చాలా దుర్బలంగా ఉంటుందని MLA గారికి వివరించబోతే, MLA మరియు వారి అనుచరులు బుడితి క్రిష్ణ మరియు పాలవలస మురళి దుర్భాషలాడుతూ MLA సమక్షంలోనే జనసేన నేతలిద్దరిపై భౌతిక దాడికి దిగడం ఈ వైసిపి వాళ్లు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం కాదా అని బాబు పాలూరు ప్రశ్నించారు. జగన్ రెడ్డి "పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం" అంటూ వింత నాటకాలు ఆడుతూ విపక్షాలపై వ్యంగ్యంగా బ్యానర్లు పెట్టిస్తూ ప్రజలను మోసం చేస్తుంటే, ఈ MLA లు, వైసిపి నాయకులు మాత్రం ప్రజల తరఫున సమస్యలపై నిలదీస్తుంటే సామాన్య కార్యకర్తలు, ప్రజల మీదకి సైతం భౌతిక దాడులకు దిగుతున్నారు. MLA చుట్టూ దొంగ నోట్లు చలామణి చేసేవాళ్లని, రియల్ ఎస్టేట్ దందా నిర్వహించే పెత్తందార్లను పెట్టుకుని మీ వైసిపి ప్రభుత్వం పేదవాళ్లపై యుద్ధం చేస్తున్నారని, ఈ విషయం ప్రజలు గ్రహించారు కాబట్టే మీరు ఎక్కడకి వెళ్లినా తిరుగుబాటు చేస్తున్నారని బాబు పాలూరు దుయ్యబట్టారు. నిన్నటి భౌతిక దాడి అంశాన్ని ఊరికే వదిలిపెట్టమని, దాడి చెయ్యడమే కాకుండా బంకురు పోలినాయుడు కుటుంబ సభ్యులను పిలిచి బెదిరించడం కూడా చేసారని, ఈ విషయంపై స్థానిక SI గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని తెలియజేసారు. ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, మీ అధిష్ఠానం కుయ్యక్తులను క్షేత్ర స్థాయిలో అమలు చెయ్యాలని చూస్తే జనసేన పార్టీ తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని బాబు పాలూరు, బంకురు పోలినాయుడు, గంట్యేడ స్వామినాయుడు, రగుమండ్ల అప్పలనాయుడు, N ఆదినారాయణ, మామిడి సత్యనారాయణ, శ్రీను, సంతోష్, అచ్యుత, రాజు తదితర జనసైనికులు మీడియా ముఖంగా హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com