కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన నాయకులు, మండల అధికార ప్రతినిధి విలేకర్ల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ గత 18 నెలల నుంచి హిందూ దేవాలయాల పై దాడిలో జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని కేవలం విచారణ పేరుతో కాలయాపనకే పరిమితమయ్యారన్నారు. రోజురోజుకు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దేవాలయాల పై దాడి అంశాన్ని విచారణ వేగవంతం చేయాలని దోషులు ఎవరు అయినప్పటికీ శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందూ దేవాలయాల రక్షణ కొరకు జనసేన పార్టీ తీవ్రంగా ఉద్యమం చేస్తుందని తెలిపారు.