Search
Close this search box.
Search
Close this search box.

ప్రొద్దుటూరులో ప్రభుత్వ, వైసీపీ నాయకుల దాడులు భయానకం

   ప్రొద్దుటూరు ( జనస్వరం ) : సామాన్యులకు ఇబ్బంది కలిగించి వ్యాపారులకు ఆర్థిక పరమైన నష్టం చేస్తే సహించదే లేదని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానికి నందిని క్లాత్ మార్కెట్ లోని తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరులో సామాన్యులను ఈ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులతో దాడులు చేయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే రాబోవు రోజుల్లో మహిళల భద్రత ఎంత భయంకరంగా ఉంటుందని తెలిపారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించి వ్యాపారులకు ఆర్థిక పరమైన నష్టం చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోబోదని వారికి అండగా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి వెనుకడ బోదని ఈ ప్రభుత్వని హెచ్చరించారు. పిచ్చి పిచ్చి చేష్టలు మానుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ సైనికులు బాల కృష్ణ రెడ్డి, బాలరాజ్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way