మండపేట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గం, కపీలేశ్వపురం మండలం, వల్లూరు గ్రామంములో శనివారం నాడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వం వారు పంచాయితీలో కాకుండా ఊరి బయట పంపిణీ చేస్తుంటే, ఇదేమి న్యాయమని వల్లూరు జనసేనపార్టీ దళిత సర్పంచ్ దాసి మీనా కుమారి ప్రశ్నించగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరియు వారి అనుచరులు మా ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకుంటామని ఎవడేం చేస్తాడో చూస్తామని దుర్బశలాడి, వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ తోటత్రిమూర్తులు మరియు వారి అనుచరులను నిలదీయగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, వారిపై దాడికి పాల్పడ్డారని, అంగర పోలీస్ స్టేషన్లో వారిపై 8గంటలకు కేసు నమోదు చేయడానికి వెళితే, అర్దరాత్రి 2 అయినా న్యాయం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేయడం లేదు. ఇదేనా ప్రభుత్వానికి దళితుల పట్ల ఉన్న ప్రేమ? అని ప్రశ్నించారు.