తిరుపతి ( జనస్వరం ) : ప్రతిపక్షాలపై దాడి చేయడం హేయమైన చర్య అని జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా? లేక ఆటవిక పాలనా నడుస్తోందా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన నగరి నియోజకవర్గ జనసేన నసయకులతో కలిసి టిడిపి నగరి ఇన్ చార్జ్ గాలి భానుప్రకాష్ కు సంఘీభావం తెలిపారు. భానుప్రకాష్ పై జరిగిన దాడిని ఖండించారు. అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు దాడులకు దిగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. మారణాయుధాలతో దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టకుండా... ప్రతిపక్షాలు ప్రెస్ మీట్ పెట్టినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపితో కలిసి జనసేన ఈ ఆటవిక దాడులను ఎదుర్కొంటుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... ఓటు అనే ఆయుధంతో బుద్ది చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నగరి నాయకులు జిల్లా అధికార ప్రతినిధి మెరుపుల మహేష్, జిల్లా కార్యదర్శి స్వామినాథన్, మండల అధ్యక్షులు ఉపేంద్ర, దేవా, జగదీష్,శివలింగం, మండల ప్రధాన కార్యదర్శి హరి వాడమాలపేట ప్రధాన కార్యదర్శి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com