చిత్తూరు, (జనస్వరం) : మీడియా తమ విధులను నిర్వహిస్తుంటే వైసిపి నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య విమర్శించారు. సిబిఐని తప్పుదోవ పట్టిస్తూ సాకులను అడ్డంగా పెట్టుకుని సాగిస్తున్న రాజకీయాలను బట్టబయలు చేస్తున్న మీడియా మీద దాడి చేయడం సరికాదని అన్నారు. పూతలపట్టు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల జన చైతన్య కార్యక్రమాల్లో భాగంగా తవణం పళ్ళు ఏపీ శివయ్య మాట్లాడుతూ అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మరియు అనుచరుల చర్యలను ఆయన ఖండించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com