Logo
Date of Publish : 04 April 2022, 4:00 pm
Editor : Sake Naresh

బెళుగుప్పలో జనసేన కార్యకర్తలపై దాడి అమానుషం : జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య

          ఉరవకొండ ( జనస్వరం ) : మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడడం అమానుష చర్య అని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య ఖండించారు. ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్న బెళుగుప్ప జనసేన పార్టీ నాయకుల మీద కర్రలతో కొట్టి దారుణంగా దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడిలో బోయ రామాంజినేయులు అనే వ్యక్తి తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే జనసేన ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య బెలుగుప్పకు వెళ్లి రామాంజనేయులను పరామర్శించి, బెలుగుప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. జనసేన జిల్లా కార్యదర్శులు గౌతం కుమార్, లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, బాల్యం రాజేష్, అనంతపురం నగర ఉపాధ్యక్షులు జక్కి రెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, బెలుగుప్ప మండల అధ్యక్షులు సుధీర్, ఉరవకొండ మండల కన్వీనర్ చంద్రశేఖర్, కూడేరు మండల కన్వీనర్ నాగేష్, వజ్రకరూరు కన్వీనర్ కేశవ, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, జనసేన నాయకులు కృష్ణ, మధు, మారుతి, అబ్దుల్, తిప్పయ్య, నాని, ప్రకాష్, శ్రీనివాసులు, నీలకంఠ, 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com