కోనసీమ సాధన సమితి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు

     ఆదిలాబాద్, (జనస్వరం) : భైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత బహుజన ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఆందోళన ద్వారా విధ్వసం సృష్టించారు. బస్సులు తగల బెట్టడం,పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రజల్లో అశాంతి వాతావరణం సృష్టించడం సిగ్గు చేటు అన్నారు. రాజ్యాంగ ఫలాలు పొంది ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించే వాళ్ళు నిజమైన దేశద్రోహులు. వీరిపై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి, కోనసీమకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, దళిత బహుజన సంఘం నాయకులు చాకేటి లస్మన్న, ఈశ్వర్, విఠల్, ఆనంద్, బౌద్ధ సంఘం నాయకులు ఆమాడే జనార్ధన్ బుద్ధ శిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way