
ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గంలోని వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాల్లో, రెండవ రోజు పర్యటనలో భాగంగా, మర్రిపాడు మండలం, శెట్టి సముద్రం గ్రామం, హరిజన వాడలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇళ్లను శ్రీధర్ గారు పరిశీలించడం జరిగింది. అలాగే పేదలకు నిత్యావసర సరుకులు ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.